Watch: పెళ్లిలో ముద్దుపెట్టుకోబోయిన వధూవరులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Pandit Stops Bride, Groom Kissing | పెళ్లి వేడుకలో వధూవరుల చర్య శృతిమించింది. అందరి ముందు వారిద్దరూ హత్తుకున్నారు. ముద్దుపెట్టుకోబోయారు. ఇంతలో పురోహితుడు వారి చర్యను అడ్డుకున్నారు. దీనిని ప్రోత్సహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో వధూవరుల చర్య శృతిమించింది. అందరి ముందు వారిద్దరూ హత్తుకున్నారు. ముద్దుపెట్టుకోబోయారు. ఇంతలో పురోహితుడు వారి చర్యను అడ్డుకున్నారు. దీనిని ప్రోత్సహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (Pandit Stops Bride, Groom Kissing) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధూవరులు వినూత్నంగా పెళ్లి మండపంపైకి చేరుకున్నారు. వధువు మెలగ్గా నడిచి వచ్చింది. వరుడు మోకాలిపై వంగి ఆమెకు పూలగుత్తి అందించాడు.
కాగా, ఆ తర్వాత ఈ జంట భావోద్వేగానికి గురైంది. అందరి ముందు వధూవరులు హత్తుకున్నారు. వారి భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి. దీంతో వధువు చెంపపై వరుడు సున్నితంగా ముద్దుపెట్టాడు. పెళ్లి అతిథులు చప్పట్లతో ప్రొత్సహించడంతో మరింతగా ముద్దుల్లో మునిగితేలేందుకు ఆ జంట సిద్ధమైంది.
మరోవైపు ఇది చూసి పెళ్లి పూజారి ఆగ్రహించారు. వెంటనే ఆ జంట వద్దకు వచ్చి వారిని విడదీశారు. దీంతో వధువు నిరాశతో పక్కకు వెళ్లింది. ఈ చర్యను పోత్సహించిన వారిపై ఆ పురోహితుడు మండిపడ్డారు.
అయితే వధువు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది చర్చకు దారితీసింది. పూజారి చర్యను కొందరు సమర్థించారు. వధూవరులు పెళ్లి ఆచారాలు గౌరవించాలని సూచించారు. అయితే కొత్త జంట చర్యకు మరికొందరు మద్దతిచ్చారు. వివాహంతో ఒకటవుతున్న తరుణంలో వారు తమ ప్రేమను వ్యక్తీకరించడంలో ఎలాంటి తప్పు లేదని వాదించారు.
Panditji stopped the groom and bride from kissing on the stage.
Feminist girls will say he’s a bad person.
But he is old, he grew up with religion and values. He was brought there to conduct their marriage and he did so.
Society has changed, while he still holds his values. pic.twitter.com/Z1WmbRo8Wq
— ︎ ︎venom (@venom1s) January 29, 2026
Also Read:
Kolkata Fire | గోడౌన్ల అగ్నిప్రమాదం ఘటనలో 21కు చేరిన మృతులు.. 28 మంది మిస్సింగ్
Delhi LG VK Saxena | మేధా పాట్కర్ పరువు నష్టం కేసులో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్దోషి
Sadhvi Prem Baisa | సాధ్వి అనుమానాస్పద మృతి.. సోషల్ మీడియా పోస్ట్‌పై పలు సందేహాలు
Watch: లోయలోకి దూసుకెళ్లబోయిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

