S-400 Air Defence System:63 వేల కోట్ల ఖర్చుతో మరో 5 ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు !
S-400 Air Defence System: 63 వేల కోట్ల ఖర్చుతో మరో 5 ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు రక్షణ శాఖ కార్యదర్శి ఓకే చెప్పినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్-400 మిస్సైల్ వ్యవస్థ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: భారత అమ్ములపొదిలోకి మరిన్ని ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్(S-400 Air Defence System) రానున్నాయి. రష్యా తయారీకి చెందిన మిస్సైల్ రక్షణ వ్యవస్థను రెట్టింపు చేసుకోవాలని భారత్ యోచిస్తున్నది. దీనిలో భాగంగా మరో అయిదు కొత్త ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తిగా ఉన్నది. సుమారు 63 వేల కోట్ల ఖర్చుతో 5 ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనే ప్రతిపాదనకు రక్షణ శాఖ కార్యదర్శి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు 5 ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్స్‌తో.. భారత్ వాటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నది.
2018లో సుమారు 5.4 బిలియన్ల డాలర్లతో 5 ఎస్-400 సిస్టమ్స్‌కు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి వరకు మూడు సిస్టమ్స్ డెలివరీ అయ్యాయి. ఈ ఏడాది చివరి వరకు మరో రెండు సిస్టమ్స్ భారత్‌కు అందనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎస్-400 సిస్టమ్స్ అప్పగింత ఆలస్యం అవుతున్నది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్-400 సిస్టమ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వారం భారతీయ వైమానిక దళం ఎస్-400 సిస్టమ్‌కు చెందిన ఓ వీడియోను కూడా పోస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

