Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి కరువు మండలాలు ప్రకటించి చేతులెత్తేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి కరువు మండలాలు ప్రకటించి చేతులెత్తేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కరువుతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోతుంటే కనీసం ఆర్థిక సహాయం లేదు, నష్ట పరిహారం లేదు, కార్యాచరణ కూడా లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు రైతులకు ఎకరాకు రూ.5 వేల పరిహారం ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఎకరానికి రూ.5వేలు, కర్నాటక రూ.2500 ఇచ్చాయి.
కానీ, రేవంత్ రెడ్డి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2వ తేదీ లేదు.. జూన్ 2వ తేదీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు..తెలంగాణ రాష్ట్రమే లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షా ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
Live: జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం https://t.co/cgrmuQPXcB
— Office of Harish Rao (@HarishRaoOffice) November 29, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

