Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగిపోతుండుగా.. ఎల్పీజీ గ్యాస్ కొరతతో పలు నగరాల్లో హోటళ్లు మూత పడుతున్నాయి. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది. గ్యాస్ లభ్యత తగ్గిన కారణంగా భారతదేశంలో యూరియా ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది.
యుద్ధం ప్రభావంతో విదేశాల నుంచి గ్యాస్ లభ్యత తగ్గడం వల్ల భారత్లోని యూరియా ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడవడం లేదు. కేవలం 60 శాతం సామర్థ్యంతోనే పని చేస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే, చివరికి దేశంలో యూరియా కొరత వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూరియా పరిశ్రమల మీద పడ్డ గ్యాస్ కొరత
ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో తగ్గిపోయిన యూరియా ఉత్పత్తి
గ్యాస్ లభ్యత తగ్గడం వల్ల కేవలం 60% సామర్థ్యంతో పనిచేస్తున్న యూరియా ప్లాంట్లు
పరిస్థితి ఇలాగే కొనసాగితే, చివరికి దేశంలో యూరియా కొరత వస్తుందని… pic.twitter.com/iBThTNbEf7
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2026
గతంలో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను యూరియాకు 475 డాలర్లు ఉండగా.. యుద్ధం తీవ్రత కారణంగా ఇప్పుడు టన్నుకు 25 శాతం కంటే ఎక్కువైంది. ప్రస్తుతం టన్ను యూరియాకు దాదాపు 600 డాలర్లకు చేరుకుందని అంతర్జాతీయ యూరియా ధరలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో మూతపడిన గ్యాస్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించిన తర్వాతే యూరియా ఉత్పత్తి పెరగడం, ధరల్లో తగ్గుదల వంటివి సాధ్యమవుతాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.