హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): విదేశీ పౌరులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. వికాస్ నిమార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వికాస్ నిమార్ అనే నిందితుడు పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం పేరుతో విదేశీయులను బెదిరించి తన ముఠాతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈతరహా మోసాలపై కొన్ని నెలల క్రితం సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.