Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేసన్‌కు వచ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి!
Jason Sanjay | తమిళనాడు సీఎం, కోలీవుడ్ దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్, అందరిలాగా కెమెరా ముందుకొచ్చి హీరో కాకుండా, కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన రీతిలో విశ్లేషించారు.
Chiranjeevi | తమిళనాడు సీఎం, కోలీవుడ్ దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్, అందరిలాగా కెమెరా ముందుకొచ్చి హీరో కాకుండా, కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన రీతిలో విశ్లేషించారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, విజయ్ కుటుంబంతో తనకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని నెమరువేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
జేసన్‌ను మొదటగా కలిసినప్పుడు 1993-95 సమయంలో మీ నాన్న విజయ్ ఎలా ఉండేవాడో అచ్చు గుద్దినట్లు నువ్వు అలాగే ఉన్నావు, మరి నటన వైపు రాకుండా దర్శకత్వాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అని నేరుగా ప్రశ్నించానని, దానికి జాసన్ తనకు కథలు రాయడం, దర్శకత్వం వహించడమే ఇష్టమని బదులిచ్చారని తెలిపారు. ఈ సమాధానంతో జేసన్‌కు తండ్రి విజయ్ యాక్టింగ్ జీన్స్ కంటే కూడా, ఆయన తాతయ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, నానమ్మ శోభల దర్శకత్వ, రచనా పటిమల జీన్స్ వంశపారపర్యంగా వచ్చాయని తనకు స్పష్టంగా అర్థమైందని చిరంజీవి వెల్లడించారు. తన కెరీర్లో నిలిచిపోయిన ‘చట్టానికి కళ్ళు లేవు’, ‘దేవాంతకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తే, శోభ గారు ఆ కథలను అందించారని, నేడు మూడో తరం కుర్రాడైన జేసన్ సరిగ్గా వారి బాటలోనే పయనిస్తూ ఆ కళాత్మక లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు.
ఎస్.ఏ. చంద్రశేఖర్ కుటుంబంతో తనకు మూడు తరాల ప్రత్యేక బంధం ఉందని, ఆయన దర్శకత్వంలో తాను సినిమాలు చేయడమే కాకుండా, విజయ్ సినీ ప్రస్థానం ప్రారంభమైన తొలినాళ్లలో ఒక చిత్రం ముహూర్తపు షాట్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి తాను క్లాప్ కొట్టానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ గొప్ప కుటుంబంపై ఉన్న అమితమైన గౌరవంతో పాటు, హీరో సందీప్ కిషన్‌పై ఉన్న అభిమానంతోనే ‘సిగ్మా’ చిత్ర వేడుకకు సంతోషంగా హాజరయ్యానని చెప్పారు. తాత ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకుడిగా, తండ్రి విజయ్ అగ్ర కథానాయకుడిగా ఇండియన్ సినిమాలో తమకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నట్లే, జేసన్ సంజయ్ కూడా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని దర్శకుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఆశీర్వదించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

