శ్రీరంగనాథ స్వామి ఆలయంలో చోరీ.. రాములవారి గుడిలో పంచలోహ విగ్రహాలు మాయం
వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ జరిగింది. రాములవారి గుడిలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయి.
వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని రాములవారి గుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చోరీకి గురైనట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.
విగ్రహాల చోరీ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. విగ్రహాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

