నగోయా: భారత యువ ప్లేయర్, స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్.. తన కెరీర్లో అత్యద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏషియన్ గేమ్స్(Asian Games)లో మహిళల సింగిల్స్ ఈవెంట్లో ఆమె ఫైనల్‌కు ప్రవేశించింది. సెమీస్‌లో జపాన్‌కు చెందిన ఆరో నెంబర్ ప్లేయర్ సటోమి వాటానబేపై 3-2 తేడాతో విక్టరీ కొట్టింది. 18 ఏళ్ల భారత ప్లేయర్ అనాహత్ .. అసాధారణ రీతిలో తన గేమ్‌ను ఆడింది. తొలుత రెండు సెట్లను కోల్పోయి 2-0 తేడాతో వెనుకబడ్డ అనాహత్.. ఆ తర్వాత అనూహ్యంగా కోలుకున్నది. ఏకంగా చివరి మూడు సెట్లలో విజయం సాధించి .. ఏషియన్ గేమ్స్‌లో తనకు పతకాన్ని ఖాయం చేసుకున్నది. అనాహత్ 9-11 11-13 12-10 11-6 11-3 స్కోరుతో ప్రత్యర్థిపై గెలిచింది.
ఇక భారత జోడి జోష్నా చిన్నప్ప, విలావన్ సెంథిల్ కుమార్.. బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్, లీ కా యి చేతిలో 2-1 (11-10 2-11 11-10) తేడా స్కోరుతో భారత జోడి ఓటమి పాలైంది.