సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మొన్న టి వరకు 37 డిగ్రీలకు చేరుకున్న పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.9 డిగ్రీలు, గాలిలో తేమ 53 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.