గుట్టలుగా ఇందిరమ్మ చీరలు
మహిళలకు పంచిపెట్టాల్సిన ఇందిరమ్మ చీరలు కంటోన్మెంట్ వర్క్‌షాపులో గుట్టలుగా పేరుకుపోయి దుమ్ముధూళితో నిండి ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శుక్రవారం కంటోన్మెంట్ వర్క్‌షాపులో పేరుకుపోయిన ఇందిరమ్మ చీరలను పరిశీలించారు.
కంటోన్మెంట్: మహిళలకు పంచిపెట్టాల్సిన ఇందిరమ్మ చీరలు కంటోన్మెంట్ వర్క్‌షాపులో గుట్టలుగా పేరుకుపోయి దుమ్ముధూళితో నిండి ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శుక్రవారం కంటోన్మెంట్ వర్క్‌షాపులో పేరుకుపోయిన ఇందిరమ్మ చీరలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యే శ్రీగణేశ్, నాయకులు గత నవంబర్‌లో పంచాల్సిన చీరలను మహిళా గ్రూపులకు పంచకుండా కంటోన్మెంట్ వర్క్‌షాప్‌లో నిల్వ ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది నవంబర్‌లో అర్హులైన కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారని తొమ్మిది నెలలు పూర్తయినా కంటోన్మెంట్‌లోని మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దసరా పండుగ ముందే బతుకమ్మ చీరలను ప్రతి ఒక్క మహిళకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వేలాది ఇందిరమ్మ చీరలను వర్క్‌షాపులో పెట్టాల్సిన అవసరం ఏముందని, దీనిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటరాముడు, నారాయణ, కల్యాణ్ సందీప్, శ్రీనివాస్, రిచర్డ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

