Snapana Tirumanjanam | ఎండు ద్రాక్ష, బాదం పిస్తా మాలలతో తిరుమలలో స్నపన తిరుమంజనం
Snapana Tirumanjanam | శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష ,బాదంపిస్తా తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మాలలతో బుధవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
తిరుమల : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష ( Raisins ), బాదంపిస్తా (Almonds) తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మాలలతో బుధవారం స్నపన తిరుమంజనం ( Snapana Tirumanjanam ) భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. తిరుమల ( Tirumala )శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు. అభిషేకానంతరం తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

ఈ వేడుకలో భాగంగా ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, నీలిరంగు పవిత్ర మాలలు, బాదం-పిస్తా మాలలు, పసుపు కొమ్ముల మాలలు, నందివర్ధనం-తామర మాలలు, రోజ్ పెటల్స్‌తో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

