Viral news | కాపురానికి వస్తలేదన్న కక్షతో అత్తగారింటికాడ భార్య ముక్కు కొరికేసిన భర్త..!
Viral news | రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం పెరిగిపెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. మంచిర్యాల జిల్లాలోని కొటపల్లి మండలంలో ఇవాళ (బుధవారం) ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. మణిచందర్, మమత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాల కారణంగా మమత తన పుట్టింట్లోనే నివసిస్తోంది.
Viral news : రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదం పెరిగిపెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. మంచిర్యాల జిల్లాలోని కొటపల్లి మండలంలో ఇవాళ (బుధవారం) ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. మణిచందర్, మమత దంపతులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబకలహాల కారణంగా మమత తన పుట్టింట్లోనే నివసిస్తోంది.
కాపురానికి రమ్మని భర్త ఎంతచెప్పినా ఆమె వచ్చేందుకు నికారిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో భార్యను తిరిగి తన వెంట కాపురానికి తీసుకొచ్చేందుకు మణిచందర్ ఇవాళ అత్తగారింటికి వెళ్లాడు. అయితే అతడి భార్య మమతను కాపురానికి పంపేందుకు ఆమె తండ్రి నిరాకరించాడు. దాంతో మామాఅల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మణిచందర్ తన మామపై కర్రతో దాడి చేశాడు.
తన తండ్రిని కొడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన మమతపై కూడా మణిచందర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కోపంలో ఆమె ముక్కును కూడా కొరికేశాడు. ఈ ఘటనలో బాధితురాలి ముక్కు ముందు భాగం తెగి వేరుపడింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

