Saifabad PS Attack | సైఫాబాద్ పీఎస్‌లో జరిగిన దాడి నిజమే.. ఒప్పుకున్న ప్రభుత్వం
Saifabad PS Attack | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా దాడి ఘటనపై ప్రభుత్వం తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.
Saifabad PS Attack | సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లోపల జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్‌పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ రిట్ పిటిషన్ వేయగా.. రిట్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా దాడి ఘటనపై ప్రభుత్వం తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపామన్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ భవనం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని.. ఈ ఘటనపై నమోదు చేయాల్సిన కేసుల కోసం కోర్టును ఆశ్రయించామని హైకోర్టుకు తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్లో దాడి ఘటన జరిగిన విషయాన్ని కోర్టు ముందు ప్రభుత్వం అంగీకరించినట్టయింది.
వచ్చింది డీజే పర్మిషన్ కోసం అని మొన్న ఎలాంటి దాడి జరగలేదన్న డీసీపీ శిల్పవల్లి ప్రకటనపై ప్రశ్నలు సంధించారు. డీజే పర్మిషన్లకు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో తీసుకుని పద్ధతి ఉందన్న బీఆర్ఎస్ న్యాయవాదులు.. దాడి జరగలేదన్న డీసీపీ శిల్పవల్లి వ్యాఖ్యలు అవాస్తవమని తేలిందన్నారు. దుండగులు మారణాయుధాలతో దాడికి వచ్చారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపించారు.
దుండగుల వద్ద కత్తులు లేవన్న ప్రభుత్వ వాదనపై కోర్టులో వాదోపవాదాలు జరుగగా.. మారణాయుధాలు దాచుకొని వచ్చారు అని బీఆర్ఎస్ లాయర్లు అంటే వారి వద్ద కత్తులు లేవని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఏ మారణాయుధాలు తీసుకొచ్చారో ప్రభుత్వ న్యాయవాదికే తెలుసు అన్న బీఆర్ఎస్ లాయర్లు అనడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిరక్షించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also :
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

