న్యూఢిల్లీ, ఆగస్టు 7: పాఠశాలకు వెళ్లడానికి ప్రాణాలు పణంగా పెడతూ విద్యార్థులు నదిని దాటడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశాలకు వెళ్లడానికి విదిశా జిల్లాలోని బెత్వే నదిపై నిర్మించిన పిల్లర్లను ప్రమాదకరంగా దాటుతూ పాఠశాలకు విద్యార్థులు వెళ్తున్న విషయాన్ని మీడియా వెలికితీసింది.
దీనిని ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఇలా పిల్లర్లను దాటుతూ వెళ్లడం వల్ల చుట్టూ తిరిగి రోడ్డు మార్గాన 13 కి.మీ వెళ్లాల్సిన దూరం 1.5 కి.మీ.కు తగ్గడంతో విద్యార్థులు ఈ ప్రమాదకరంగా పిల్లర్లపై జంప్ చేస్తూ వెళ్తున్నారు. విద్యార్థులను ఇలా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న కమిషన్ దీనిపై సవివరంగా నివేదిక అందజేయాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.