Government Schools | 60% బడుల్లో కట్టెల పొయ్యే.. నెలలు గడుస్తున్నా కానరాని పురోగతి!
Government Schools | దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంటింటా వంటకు గ్యాస్ వినియోగిస్తున్న ఈ కాలంలో సర్కార్ బడుల్లో మాత్రం ఇంకా కట్టెల పొయ్యే దిక్కయింది.
Government Schools | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంటింటా వంటకు గ్యాస్ వినియోగిస్తున్న ఈ కాలంలో సర్కార్ బడుల్లో మాత్రం ఇంకా కట్టెల పొయ్యే దిక్కయింది. రాష్ట్రంలోని 60 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. 40శాతం బడుల్లోనే గ్యాస్ స్టవ్ వాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,147 పాఠశాలలుంటే కేవలం 9,939 సూళ్లలో మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి.
అంటే 38.45 శాతం పాఠశాలలకే ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నదన్నమాట. మిగతా 16 వేలకు పైగా పాఠశాలల్లో వంటలు చేసేందుకు కట్టెల పొయ్యే దిక్కయింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించాలని తరుచూ కేంద్రం మెట్టికాయలేస్తున్నది. నూరుశాతం గ్యాస్ కనెక్షన్లు కల్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 6న అన్ని జిల్లాల కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ లేఖలు రాశారు.
ఆహార నమూనా పరీక్షలెకడ?
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేస్తున్న ఆహార నాణ్యతను తరుచూ పరీక్షించాల్సి ఉన్నది. కనీసంగా 5 శాతం ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపాలి. 2026-27లో జూన్ వరకు 1,307 పాఠశాలకు కేవలం 91 పాఠశాలల్లోనే ఆహార నమూనాలను పరీక్షించారు. అంతేగాకుండా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలి. ఆర్బీఎస్కే కింద 81.12 శాతం విద్యార్థులకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయి. వంట కార్మికుల్లో 71.58 శాతం మందికే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పాఠశాలల్లో పోషకాహారాన్ని అందించేందుకు సూల్ న్యూట్రిషన్ గార్డెన్లు నిర్మించే విషయంలో ఇప్పటివరకు 21,496 పాఠశాలల్లో వీటిని అభివృద్ధి చేశారు. 26,147 సూ ళ్లలో ఇది 82.212 శాతం మాత్రమే. మరో 18 శాతం స్కూళ్లలో ఈ గార్డెన్లను అందుబాటులోకి తేలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

