గాఢ ప్రేమ.. గాడి తప్పితే
కార్తిక్, ప్రియ భార్యాభర్తలు. ఇంట్లో ఉదయం లేవగానే.. ప్రియ సంతోషంగా ఉంటే, కార్తిక్ ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రియ చిరాకుగా ఉంటే.. కార్తిక్ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. తప్పు తనది కాకపోయినా.. ‘నా వల్లే తన మూడ్ ఆఫ్ అయిందా?’ అని భయపడుతూ ఉంటాడు.
కార్తిక్, ప్రియ భార్యాభర్తలు. ఇంట్లో ఉదయం లేవగానే.. ప్రియ సంతోషంగా ఉంటే, కార్తిక్ ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ ఏదైనా కారణం చేత ప్రియ చిరాకుగా ఉంటే.. కార్తిక్ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. తప్పు తనది కాకపోయినా.. ‘నా వల్లే తన మూడ్ ఆఫ్ అయిందా?’ అని భయపడుతూ ఉంటాడు. ఆమెను కాకా పట్టడానికి రోజంతా ప్రయత్నిస్తూ.. తన ఆఫీస్ పనిపై దృష్టి పెట్టలేకపోతాడు.
రమ్యకి పెయింటింగ్ అంటే ప్రాణం. ఆ రంగంలో ఉన్నతంగా ఎదగాలనే ఆశయం ఆమెది. కానీ, ఆమె భర్తకు మాత్రం.. రమ్య ఉద్యోగం చేయడం, బయటికి వెళ్లడం అస్సలు నచ్చదు. అతన్ని సంతోష పెట్టడమే ధ్యేయంగా.. రమ్య తన ఆశయాలను పక్కన పెట్టేసింది. చివరికి తన స్నేహితులతో మాట్లాడటం కూడా మానేసింది. అతనికి నచ్చినట్లు ఉండటానికి.. తన ఉనికిని తానే పూర్తిగా తుడిచేసుకుంది.
ఈ రెండు సందర్భాలను చూడండి. కార్తిక్ సంతోషమంతా ప్రియ మూడ్‌పైనే ఆధారపడి ఉంది. ఇటు భర్త సంతోషం కోసం రమ్య తన ఇష్టాలు, స్నేహితులను పక్కన పెట్టేసింది. దీన్నే సైకాలజీలో ‘కో-డిపెండెన్సీ’ అంటారు. ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరు వ్యక్తులు తమ స్వతంత్ర ఆలోచనలు, వ్యక్తిత్వంతో ఉంటూనే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారు. కానీ, ఈ కో-డిపెండెంట్ బంధంలో ఒకరి ఉనికిని మరొకరు నొక్కివేస్తుంటారు. భయం, ఆందోళన ప్రాతిపదికన బంధాన్ని నడుపుతారు.
కో-డిపెండెన్సీ సంబంధాలలో ఒక వ్యక్తి తన సొంత భావోద్వేగాలు, అవసరాలు, జీవితాన్ని కూడా పక్కన పెట్టి పూర్తిగా భాగస్వామి అవసరాలు, సమస్యలు, వారి భావోద్వేగాల చుట్టూనే తన జీవితాన్ని నిర్మించుకుంటారు. ఇది గాఢమైన ప్రేమ లేదా త్యాగంలా అనిపించినప్పటికీ, అంతర్గతంగా వ్యక్తిగత గుర్తింపును కోల్పోవడానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
కో-డిపెండెన్సీ అంటే?
బంధంలో ఆధారపడే వ్యక్తి తన స్వీయ గౌరవం, గుర్తింపు కోసం భాగస్వామి ఆమోదం పైనే ఆధారపడతారు. ఎదుటివారిని రక్షించడం లేదా బాగుచేయడమే తన బాధ్యతగా భావిస్తారు.
ఇవీ లక్షణాలు..
- శక్తికి మించిన విషయాల్లో కూడా భాగస్వామిని బాధపెట్టకూడదని ప్రతిదానికీ ‘సరే’ అనడం.
- తమ శారీరక, మానసిక లేదా భావోద్వేగ అవసరాల కంటే భాగస్వామి అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం.
- ఎదుటివారి ప్రవర్తనను లేదా భావాలను మార్చాలని నిరంతరం ప్రయత్నించడం.
- సంబంధం విఫలమవుతుందేమో లేదా భాగస్వామి విడిచిపెడతారేమో అనే తీవ్రమైన భయం.
- భాగస్వామి మూడ్ లేదా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి కలత చెందడం.
- భాగస్వామికి మద్యం లేదా ఇతర అలవాట్లు ఉన్నప్పుడు, వారి బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుతూ, సమాజం ముందు వారిని కాపాడేందుకు నిరంతరం ప్రయత్నించడం.
- భాగస్వామి సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉండటం; భాగస్వామి కోపంగా లేదా విచారంగా ఉంటే తీవ్రమైన ఆందోళనకు గురికావడం.
- భాగస్వామి తప్పుగా ప్రవర్తించినా, నిందించినా లేదా గౌరవం ఇవ్వకపోయినా, సంబంధం తెగిపోతుందనే భయంతో మౌనంగా భరించడం.
కౌన్సిలింగ్ ఇలా..
కో-డిపెండెన్సీ ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం క్రమబద్ధమైన, సున్నితమైన ప్రక్రియ. వీరిలో ఎక్కువగా నేరభావన, తిరస్కరణ భయంతోపాటు తక్కువ స్వీయ-గౌరవం ఉంటాయి. ఇలాంటి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించేలా థెరపిస్ట్ కౌన్సెలింగ్ ప్రణాళికను రూపొందించాలి. కోపింగ్ ప్యాటర్న్స్ గుర్తించడం: బాధితుడు తన భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల ప్రవర్తనను కప్పిపుచ్చడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాడో, తనను తాను ఎంతగా నిర్లక్ష్యం చేసుకుంటున్నాడో అంచనా వేయాలి. భావోద్వేగ మేధస్సు పెంచడం: తమ ప్రవర్తన ‘పరిపూర్ణమైన ప్రేమ’ కాదని, అది ఒక రకమైన ‘సహ-ఆధారపడటం’ అని క్లయింట్‌కి స్పష్టంగా, సానుభూతితో అర్థమయ్యేలా చెప్పాలి.
హద్దుల ప్రాముఖ్యత: ఆరోగ్యకరమైన సంబంధాలలో వ్యక్తిగత సరిహద్దులు ఎంత అవసరమో మానసిక విశ్లేషణ ద్వారా వివరించాలి.
- బాల్యంలో కుటుంబ వాతావరణం, గత అనుభవాలు లేదా గాయాలు ఈ రకమైన మనస్తత్వానికి ఏ విధంగా కారణమయ్యాయో క్లయింట్ గ్రహించేలా చేయాలి.
- క్లయింట్‌లో ఉండే ప్రతికూల ఆలోచనలను సవాల్ చేసి, సానుకూల ప్రత్యామ్నాయ ఆలోచనలను పెంపొందించాలి.
స్వీయ-విలువ పెంపొందించడం
ఎదుటివారి ఆమోదంపై ఆధారపడకుండా, తమ సొంత సామర్థ్యాలు, విలువలను గుర్తించేలా చేయడం కౌన్సెలర్ లక్ష్యం కావాలి. క్లయింట్‌కి కౌన్సెలర్ ఎప్పుడూ రక్షకుడిగా మారకూడదు. నిర్ణయాలు క్లయింటే తీసుకునేలా ప్రోత్సహించాలి. ఏండ్ల తరబడి ఉన్న ప్రవర్తనా విధానం ఒక్కసారిగా మారదు, కాబట్టి చిన్నచిన్న మార్పులను కూడా గుర్తించి ప్రోత్సహించాలి. ఏ బంధమైనా బలంగా మారాలి, గుదిబండగా కాదు. ఒకవేళ మీ బంధంలో కో-డిపెండెన్సీని గుర్తిస్తే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుని బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే సైకాలజిస్ట్‌ని సంప్రదించండి.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- karthik
- life style
- love
- ramya
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

