రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
రాజాపేట మండలంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. రాజాపేట గ్రామ శివారులో గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న నలుగురు యువకులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి...
– ధూల్‌పేట్ నుండి తీసుకొచ్చి విక్రయాలు, వినియోగం
– 100 గ్రాముల గంజాయి, బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం
రాజాపేట, నవంబర్ 17 : రాజాపేట మండలంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. రాజాపేట గ్రామ శివారులో గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న నలుగురు యువకులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు గంజాయిని కలిగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ మహమ్మద్ తఖియుద్దీన్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 100 గ్రాముల గంజాయి లభించింది.

రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ నుండి గంజాయిని కొనుగోలు చేసి రాజాపేట మండలానికి తీసుకొచ్చి వినియోగించడంతో పాటు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. చల్లూరు గ్రామానికి చెందిన గంగు కార్తీక్‌రెడ్డి (21), పాముకుంట గ్రామానికి చెందిన దుబ్బాసి దినేష్ (21), వెంకటాపురం జాన్ (19), బసంతపురం గ్రామానికి చెందిన కట్కూరి రాజు (20)గా పోలీసులు గుర్తించారు. . ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ తఖియుద్దీన్ మాట్లాడుతూ.. గంజాయి సేవించే వారితో పాటు విక్రయించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Ganja
- rajapeta
- Yadadri news
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ఎంజీయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
AP News | పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
సింగరేణిలో 135 మంది జనరల్ అసిస్టెంట్ ఉద్యోగులకు సర్ఫేస్ పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

