AP News | పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
AP News | ఏపీలోని కడప జిల్లాలో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయకు చెందిన టీడీపీ నాయకుడు పీపీ చెన్నరాయుడు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి దహనం చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
AP News : ఏపీలోని కడప జిల్లాలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయకు చెందిన టీడీపీ నాయకుడు పీపీ చెన్నరాయుడు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి దహనం చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి చెన్నరాయుడు తన వాహనంలో వేంపల్లె మండలంలోని గండిరోడ్డు మీదుగా వెళుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును అడ్డగించారు. ఆ తర్వాత చెన్నరాయుడు చూస్తుండగానే కారుకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపుచేశారు.
ఈ దాడి జరిగిన ప్రదేశంలో ఖాళీ బీరు సీసాలు, చెప్పులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే టీడీపీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి, సర్పంచ్ అభ్యర్థిగా ఎస్ గౌస్ పేరును ప్రకటించారు.
గత 50 ఏళ్లలో ఈ స్థానానికి ఒక మైనారిటీ నేతను బరిలోకి దించడం ఇదే తొలిసారని, ఇక్కడ కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకున్న కొద్ది రోజులకే చెన్నరాయుడు వాహనాన్ని తగలబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
సింగరేణిలో 135 మంది జనరల్ అసిస్టెంట్ ఉద్యోగులకు సర్ఫేస్ పోస్టింగ్లు
మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
Rajinikanth | ఫ్యామిలీతో వెకేషన్ మూడ్లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

