సింగరేణిలో 135 మంది జనరల్ అసిస్టెంట్ ఉద్యోగులకు సర్ఫేస్ పోస్టింగ్‌లు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం రీజియన్ పరిధిలోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ (అండర్ గ్రౌండ్) ఉద్యోగులను ఉపరితల (సర్ఫేస్) విధులకు మార్చేందుకు కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్లో వెబ్ కౌన్సెలింగ్...
– సీనియారిటీ ప్రాతిపదికన వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌ల కేటాయింపు
రుద్రంపూర్, నవంబర్ 17 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం రీజియన్ పరిధిలోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ (అండర్ గ్రౌండ్) ఉద్యోగులను ఉపరితల (సర్ఫేస్) విధులకు మార్చేందుకు కొత్తగూడెంలోని ఆర్‌సీఓఏ క్లబ్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో సీనియారిటీ ప్రాతిపదికన మొత్తం 145 మంది ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశారు. వీరిలో ఏడుగురు ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు గైర్హాజరు కాగా, మరో ముగ్గురు ఉద్యోగులు సర్ఫేస్ విధులకు వెళ్లేందుకు తమ అంగీకారం లేదని తెలిపారు. మిగిలిన 135 మంది ఉద్యోగులకు వారి సీనియారిటీ ఆధారంగా జనరల్ అసిస్టెంట్ (సర్ఫేస్) పోస్టింగ్‌లను కేటాయించారు. ఇందులో కొత్తగూడెం ఏరియాకు 10 మందిని, సత్తుపల్లి ఏరియాకు 125 మంది ఉద్యోగులను కేటాయించారు.
ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తూ నిర్వహించి పోస్టింగ్‌ల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, ఏజీఎం (ఐఈడీ) సి. వెంకయ్య, డీజీఎం (పర్సనల్) ఎస్. వెంకటేశ్వరరావు, డీజీఎంలు (ఐఈడీ) శంకర్ రెడ్డి, యోహాన్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్లు కృష్ణ, ఎం. శ్రవణ్, డిప్యూటీ మేనేజర్ కార్తీక్ శర్మతో పాటు పర్సనల్, ఐఈడీ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణిలో 135 మంది జనరల్ అసిస్టెంట్ ఉద్యోగులకు సర్ఫేస్ పోస్టింగ్‌లు
మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
Rajinikanth | ఫ్యామిలీతో వెకేషన్ మూడ్‌లో రజినీకాంత్.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

