Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Munagaku | మనకు ప్రకృతి ఎన్నో విధాలుగా సాయపడుతుంది. ప్రకృతిసిద్ధంగా లభించే చెట్ల ద్వారా మనకు ఆహారంతోపాటు ఔషధాలు కూడా మెండుగా లభిస్తాయి. ఆహారంగా ఉపయోగపడే కొన్ని మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి వాటిలో మునగ కూడా ఒకటి.
Munagaku : మనకు ప్రకృతి ఎన్నో విధాలుగా సాయపడుతుంది. ప్రకృతిసిద్ధంగా లభించే చెట్ల ద్వారా మనకు ఆహారంతోపాటు ఔషధాలు కూడా మెండుగా లభిస్తాయి. ఆహారంగా ఉపయోగపడే కొన్ని మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి వాటిలో మునగ కూడా ఒకటి. మునగాకు (Moringa leaves) ను ఆకు కూరగానో, పప్పులో కలెగూరగానో లేదంటే పచ్చడిగానో చేసుకుని తినడంవల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. మరి మునగాకుతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
ప్రయోజనాలు..
వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.
పాలకూరతో పోలిస్తే మునగాకులో మూడు రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి.
మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల మునగాకును నిత్యం వాడటంవల్ల అతిగా తినడం అనే సమస్య తీరుతుంది.
మునగాకులో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.
మునగలోని విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మునగాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munagaku | మునగాకుతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ఎంజీయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

