AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
AP News | అక్వాన్ తుపాను తీరంవైపు దూసుకొస్తున్నది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమై ఉన్నది. తమిళనాడు రాజధాని చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్‌కు 660 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నది.
AP News : అక్వాన్ తుపాను తీరంవైపు దూసుకొస్తున్నది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమై ఉన్నది. తమిళనాడు రాజధాని చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్‌కు 660 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుపాను ఉన్నది. గడిచిన 6 గంటలుగా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నది.
ఇవాళ రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమ-వాయవ్య దిశలో కదులుతూ ఎల్లుండి ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు.
తపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురు, శక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో అక్వాన్.. శుక్రవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటే ఛాన్స్
రాజాపేటలో గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
I hate Marriage Trailer | యూత్‌కు కనెక్ట్ అయ్యేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ విడుదల!
ఎంజీయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
AP News | పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుకు నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

