సూర్యాపేటలో మాజీ సర్పంచ్ల అర్ధనగ్న ప్రదర్శనతమ బిల్లులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని మాజీ సర్పంచ్‌లు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మరెందరో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు.

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానంతో అక్షయపాత్ర అనే ప్రైవేట్ సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని దొడ్డిదారిన అప్పజెప్పే కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.