చండీగఢ్: కాంగ్రెస్ నాయకురాలు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో కొనసాగేందుకు ఎన్నికలకు ముందు బాంబు పేలుళ్లతో కలకలం రేపాలని కొందరు అధికారులు తనకు సూచించినట్లు చెప్పారు. (Rajinder Kaur Bhattal) రాజకీయ పోటీలో గెలువడం కోసం ఎన్నికలకు ముందు మార్కెట్లు, రైళ్లలో పేలుళ్లు జరిపి భయానక వాతావరణాన్ని సృష్టించమని ఆ అధికారులు తనను కోరినట్లు ఆమె ఆరోపించారు. అయితే శవాల మీద రాజకీయాలు చేయబోనన్న తాను ఆ సూచనలను వెంటనే తిరస్కరించినట్లు పాడ్‌కాస్ట్‌లో ఆమె అన్నారు.
కాగా, పంజాబ్ మాజీ సీఎం రాజిందర్ కౌర్ భట్టల్ చాలా కాలం తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వివాదం చెలరేగింది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నది. రాజిందర్ కౌర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మౌనం వహించడంపై అనుమానం వ్యక్తం చేసింది. సీఎం భగవంత్ మాన్ దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భూపేష్ బఘేల్ దీనిపై స్పందించారు. వాస్తవానికి ఎలాంటి సంఘటన జరగనప్పుడు, ఆమె స్వయంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు సమస్య ఏమిటని ప్రశ్నించారు.
Also Read:
Husband Calls Monkey, Model Suicide | సరదాగా ‘కోతి’ అని పిలిచిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న మోడల్
Man Kills Leopard | కుమారుడ్ని కాపాడేందుకు.. చిరుతను చంపిన వ్యక్తి
Watch: జైలులో ఉన్న ప్రియుడ్ని ఆశ్చర్యపరిచిన మహిళ.. అతడ్ని కలిసి రీల్ రికార్డ్