ముంబై: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ (Sunetra Pawar) ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె శనివారం ఉదయం ముంబైలోని విధాన్ భవన్కు చేరుకున్నారు. అక్కడ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సునేత్రా పవార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాగా, శనివారం సాయంత్రం 5 గంటలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆ రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి ఆమె అవుతారు. రాజ్యాంగం ప్రకారం శాసన సభ లేదా శాసన మండలికి ఎన్నిక కాని వ్యక్తి కూడా మంత్రి పదవి చేపట్టవచ్చు. అయితే ఆ వ్యక్తి ఆరు నెలల్లోగా శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) లేదా శాసనమండలి సభ్యుడిగా (ఎమ్మెల్సీ) ఎన్నికవ్వాలి.
#WATCH | Mumbai, Maharashtra: NCP legislative party meeting underway at the State Legislative Assembly.
Late Deputy CM Ajit Pawar’s wife and Rajya Sabha MP Sunetra Pawar and others are present here.
(Video: NCP) pic.twitter.com/OlyS2rHMD5
— ANI (@ANI) January 31, 2026
Also Read:
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్
Watch: మహిళపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి.. తల, ముఖం, మెడకు 50 కుట్లు