మనుషులారా.. మన్ను తింటాన్లా?
అన్నీ తెలిసినోళ్లం అధిక తెలివి ఉన్నోళ్లం అని చెప్పుకొని తిరుగుతరు కదా మరీ ఇప్పుడేమైంది.. వాన పడుతుందంటే వణికిపోతాండ్లు దడ లేకుండా ధైర్యంగుండొచ్చు కదా
అన్నీ తెలిసినోళ్లం
అధిక తెలివి ఉన్నోళ్లం
అని చెప్పుకొని తిరుగుతరు కదా
మరీ ఇప్పుడేమైంది..
వాన పడుతుందంటే వణికిపోతాండ్లు
దడ లేకుండా ధైర్యంగుండొచ్చు కదా
అలా మీరెందుకుంటరు?
చెప్పేటివి శ్రీరంగనీతులు
చేసేటివేమో తప్పులు!
ఆనాడు మొర్రో అని మొత్తుకున్న
నా గోస చూసిండ్ల..?
నా బాధ ఇన్నరా..?
‘చెరువు’గా ఉండి మీ ఆదరువు నైతాంటే
మట్టి పోసి నన్ను పూడ్చి
నాకు రూపం లేకుండా చేసి
భవంతులు కట్టుకొని
భాగ్యవంతులమని భరోసగుంటిరి
ఇండ్లు కట్టుకొని హాయిగా పంటిరి
మేఘం ఉర్మి కుండపోత వాన కురుస్తాంటే
ఇండ్లళ్ల్లకు నీళ్లొస్తున్నయని
నీరుగారి పోతాంటిరి!
భూములను కబ్జా పెడితిరి
పంటలను పొట్టన పెట్టుకుంటాంటిరి
ఆనాడు నన్ను లేకుండా చేసినామని
జబ్బలు సరుసుకుంటిరి
విందులు చేసుకుంటిరి
ఈరోజు మీ ఇండ్లళ్లకు నేనొస్తున్నందుకు
కుమిలి కుమిలి సత్తాంటిరి
కండ్లళ్ల నీళ్లు తీస్తాంటిరి
నాకు ద్రోహం తలపెడితే ఊకుంటానా..?
ఉప్పెనై పొంగి మిమ్ముల ముంచెత్తనూ!
నేనున్న కాడనే నన్ను ఉండనియ్యండి
మీ దరికి రాను, మీకు చేటు చేయను
నేను నేనుగానే ఉంటా..
మీరు మీరుగానే ఉండండి
నాకు ఉనికే లేకుండా
చెయ్యాలని చూస్తే మాత్రం
ఉగ్రరూపం దాల్చి మీ ఊపిరి తీస్త!
-తాండ్ర చిరంజీవి
99591 80762
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

