పాట్నా: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువతితో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు, మరికొందరు కలిసి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి చంపారు. (Student Murder) ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆరా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సన్నీ కుమార్ సింగ్ ఇంటర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం పది గంటలకు స్నేహితుడితో కలిసి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. గంట తర్వాత ఆ విద్యార్థిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా బైక్‌పై ఒక చోటకు తీసుకెళ్లారు. అతడ్ని కొట్టి, గొంతునొక్కి హత్య చేశారు.
కాగా, కొందరు వ్యక్తులు తనను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్తున్నట్లు సన్నీ కుమార్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సన్నీ కుమార్‌ను కిడ్నాప్ చేసి కొట్టి చంపినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయితో వివాదం కారణంగా స్టూడెంట్ హత్యకు కుట్ర జరిగినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యువతి ప్రియుడు, అతడి స్నేహితులు కలిసి సన్నీ కుమార్‌ను కిడ్నాప్ చేసి కొట్టి చంపినట్లు చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Bridge Collapses | పశ్చిమ బెంగాల్లో కూలిన వంతెన.. మమతా ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
Sunetra Pawar | ఎన్సీపీ శాసనసభ పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ఎన్నిక
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్