ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అగ్రహీరో విజయ్ దేవరకొండ.. నిదానంగా మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కాగా, రెండోది రవికిరణ్ కోలా ‘రౌడీ జనార్దన’. ప్రస్తుతం ఈ రెండు సినిమాలూ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా విజయ్ మరో సినిమాకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. నానితో ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట.
నిజానికి ‘హాయ్ నాన్న’ తర్వాత ఎన్టీఆర్ కోసం ఓ కథ రాసుకున్నాడు శౌర్యువ్. తారక్‌కు ఉన్న కమిట్మెంట్స్ వల్ల అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అదే కథను విజయ్‌కు వినిపించాడని, విజయ్‌కు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ‘హాయ్ నాన్న’ వంటి క్లాస్ మూవీతో ప్రేక్షక హృదయాలను టచ్ చేసిన శౌర్యవ్.. ఈసారి మాత్రం భారీ యాక్షన్ స్క్రిప్ట్‌నే సిద్ధం చేశాడట. ప్రతిష్టాత్మక కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానున్నది.