కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. ఆ రాష్ట్రంలో కూలిన వంతెనల జాబితాను బయటపెట్టింది. (Bridge Collapses) పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సీతల్‌కుచి బ్లాక్‌లోని దేబ్నాథ్పారా ప్రాంతంలో ఒక వంతెన కూలిపోయింది. పాత వంతెనపై భారీ వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
కాగా, అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ పాలనలో పలు వంతెనలు కూలినట్లు ఆరోపించింది. మఝేర్హాట్ వంతెన, వివేకానంద ఫ్లైఓవర్, ఉల్టాడంగా ఫ్లైఓవర్, మంగంజ్ కెనాల్ వంతెన, కాక్ద్వీప్ వంతెనతో సహా పలు ప్రధాన బ్రిడ్జీలు కూలడాన్ని ప్రస్తావించింది. ‘మమత పాలనలో చాలా వంతెనలు నరకానికి దారులుగా మారాయి’ అని ఎక్స్ పోస్ట్‌లో బీజేపీ విమర్శించింది.
#WATCH | West Bengal | A bridge collapses in Debnathpara area of Sitalkuchi block in Cooch Behar. No casualties reported. Further details are awaited. pic.twitter.com/WDxvy9NYWQ
— ANI (@ANI) January 31, 2026
Another day, another bridge collapse in West Bengal.
This time in Sitalkuchi, Coochbehar district. The hallmark of infrastructure during Mamata’s regime has been collapsing bridges all over West Bengal.
👉Majherhat Bridge
👉Vivekananda Flyover
👉Ultadanga Flyover
👉Manganj… pic.twitter.com/uuYmAS1Y0B— BJP West Bengal (@BJP4Bengal) January 30, 2026
Also Read:
Sunetra Pawar | ఎన్సీపీ శాసనసభ పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ఎన్నిక
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్
Watch: మహిళపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి.. తల, ముఖం, మెడకు 50 కుట్లు