హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర భవిష్యత్తును రూపొందించడంలో గ్రూప్-1 అధికారుల పాత్ర కీలకమని ఎంసీఆర్హెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి పేర్కొన్నారు. సోమవారం ఎంసీఆర్హెచ్చార్డీ ఇన్స్టిట్యూట్లో గ్రూప్-1 అధికారుల శిక్షణ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సేవ చేయాలనే సంకల్పమే గ్రూప్-1 అధికారులను విజయ తీరాలకు చేరుస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కాకుండా ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గిరిజన రైతులు సేకరించిన మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్(ఎంఎఫ్పీ)కి కనీస మద్దతు ధర అందించేందుకు న్యూఢిల్లీలోని ట్రైఫెడ్-టీజీసీసీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో టీజీసీసీ సంస్థ ఎండీ సబ్యసాచి ఘోష్, ట్రైఫెడ్ ఎండీ ఎం రాజమురగన్లు సంతకం చేశారు. ఈ ఒప్పందంతో అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడిన గిరిజన రైతులు ప్రయోజనం పొందనున్నారు.