ముంబై: విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ (Sunetra Pawar) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ముంబైలోని లోక్ భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తొలి మహిళగా సునేత్ర పవార్ నిలిచారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘అజిత్ దాదా అమర్ రహే’ అన్న ఎన్సీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది.
కాగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా సునేత్ర పవార్ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉన్నది.
మరోవైపు అజిత్ పవార్ నిర్వహించిన ఎక్సైజ్, మైనారిటీ వ్యవహారాలు, క్రీడలు- యువజన సంక్షేమ మంత్రిత్వ శాఖలను సునేత్ర పవార్‌కు కేటాయించారు. అయితే మార్చిలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అజిత్ పవార్ నిర్వహించిన ఆర్థిక శాఖను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాత్కాలికంగా తన వద్ద ఉంచుకున్నారు. ఆర్థిక శాఖను ఆ తర్వాత ఎన్సీపీకి కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
— ANI (@ANI) January 31, 2026
Also Read:
Sunetra Pawar | ఎన్సీపీ శాసనసభ పక్ష నాయకురాలిగా సునేత్రా పవార్ ఎన్నిక
Sharad Pawar | ‘ఆ విషయం నాకు తెలియదు’.. సునేత్రకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్
Bridge Collapses | పశ్చిమ బెంగాల్లో కూలిన వంతెన.. మమతా ప్రభుత్వంపై బీజేపీ ఫైర్
Student Murder | ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో వివాదం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య