IND vs ENG : వాంఖడే వేదికగా జరుగుతున్న సెమీ ఫైనల్లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై చెలరేగిన సంజూ శాంసన్(89) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టగా.. మిడిలార్డర్లో శివం దూబే(43) ఉతికేశాడు. వరుసగా రెండో అర్ధ శతకంతో భారీ స్కోర్‌కు సంజూ బాటలు వేయగా.. ఇషాన్ కిషన్(39) దూబే మెరుపులతో రాకెట్ వేగంతో పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా(27), తిలక్ వర్మ(21)లు తమమార్క్ విధ్వంసంతో కదం తొక్కగా టీమిండియా 253 పరుగులతో ప్రత్యర్ధికి కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ అర్ధ శతకంతో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్ సెమీస్‌లోనూ దంచేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(9) ఔటైనా.. తానేమీ తొందరపడకుండా స్కోర్ బోర్డును ఉరికిస్తున్నాడు. 15 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ క్యాచ వదిలేయండంతో బతికిపోయిన ఈ చిచ్చరపిడుగు.. ఆర్చర్ ఓవర్లో 4 , 6, 4తో రన్స్ పిండుకున్నాడు. ఆపై జాక్స్‌ను ఉతికేస్తూ ఇషాన్ కిషన్(38).. సంజూ చెరొక ఫోర్ కొట్టారు. ఆపై.. ఓవర్టన్కు దడ పుట్టిస్తూ వరుసగా రెండు ఫోర్లో స్కోర్ 50 దాటించాడు ఇషాన్. పవర్ ప్లే చివరి ఓవర్లో సామ్ కరన్‌ను బాదేస్తూ.. తొలి రెండు బంతుల్ని సంజూ బౌండరీకి తరలించాడు. దాంతో.. 6 ఓవర్లకు భారత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. 8.3 ఓవర్లకే స్కోర్ వంద దాటింది.
Innings Break!#TeamIndia register the highest team total in ICC Men’s T20 World Cup knockouts 🔥👏
Over to the bowlers to defend this 🙌
Scorecard ▶️ https://t.co/LxSBs3EDPx#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/IKEpHNKHJT
— BCCI (@BCCI) March 5, 2026
పవర్ ప్లే తర్వాత కూడా జోరు తగ్గించని శాంసన్. డాసన్ ఓవర్లో సిక్సర్‌తో ఈ ఫార్మాట్లో ఐదో అర్ధ శతకం సాధించాడు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేలా కనిపించిన ఈ ద్వయాన్ని రషీద్ విడదీశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన శివం దూబే(43) సిక్సర్లతో తడాఖా చూపించాడు. ఆర్చర్ ఓవర్లో రెండు సిక్సర్లతో శతకానికి చేరువైన సంజూను జాక్స్ బోల్తా కొట్టించాడు. హార్దిక్ పాండ్యా(27)తో సమన్వయం లోపించి దూబే రనౌటవ్వగా.. తిలక్ వర్మ(21) సిక్స్‌లతో రెచ్చిపోయాడు.
Stand and deliver! 🎆
Shivam Dube with a power-packed 43(25) to take #TeamIndia past 2⃣0⃣0⃣ 👏
Updates ▶️ https://t.co/LxSBs3EDPx#T20WorldCup | #MenInBlue | #ENGvIND pic.twitter.com/m98aTIAp9X
— BCCI (@BCCI) March 5, 2026
ఆర్చర్ ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదిన అతడు.. బౌల్డయ్యాడు. విల్ జాక్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపగా స్కోర్ 250 దాటింది. పాండ్యా రనౌటయ్యాక.. చివరి బంతికి బైస్ రూపంలో రెండు పరుగులు వచ్చాయి. దాంతో.. టీమిండియా నిర్ణీత ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 253 పరగులతో ఇంగ్లండ్‌కు రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి కప్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. శ్రీలంక 264 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.