Kiren Rijiju | రాహుల్‌గాంధీ వైఖరి మారినట్లుంది.. కేంద్రమంత్రి కిరెణ్ రిజుజు
Kiren Rijiju | మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్ (Ask me Anything)’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని అన్నారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ (Instagram) లో ఈ అంశంపై మరింత వివరంగా పేర్కొన్నారు.
Kiren Rijiju : మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్ (Ask me Anything)’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని అన్నారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ (Instagram) లో ఈ అంశంపై మరింత వివరంగా పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళల్లో ఉన్న శక్తి పూర్తిస్థాయిలో బయటకు రావడం లేదని రాహుల్ అన్నారు. మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాలని చెప్పారు. ఇళ్లలో, కుటుంబాల్లో, సమాజంలో తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అంగీకరించని విషయాలపై కూడా మహిళలు తమ అభిప్రాయం చెప్పగలగాలని అన్నారు. పురుషుల ఆధిపత్యం నుంచి మహిళలకు కొంత స్వేచ్ఛ అవసరమని చెప్పారు.
అప్పుడే దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నాయని రిజిజు అన్నారు. ‘మహిళల విషయంలో రాహుల్‌గాంధీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంట్ ఆమోదించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా ఈ చట్టం ఉంది. అయితే దీని అమలుకు నియోజకవర్గాల పునర్విభజన అవసరం.
ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును తిరిగి తీసుకొచ్చేందుకు విపక్షాల మద్దతును ప్రభుత్వం కోరుతోంది. రాహుల్‌గాంధీతో గురువారం రిజిజు ఫోన్లో మాట్లాడారు. బిల్లును త్వరగా తీసుకొస్తే మహిళా రిజర్వేషన్ల అమలు వేగంగా జరిగే అవకాశం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోతే వారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2026 రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం పొందలేదు. ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య చర్చ కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

