Sanjay Raut | నాగ్‌పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
Sanjay Raut | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్ పేరును ‘చైత్యభూమి’గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ‘నాగ్‌పూర్’ పేరును కూడా 'దీక్షాభూమి'గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్ పేరును ‘చైత్యభూమి’గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు.
‘నాగ్‌పూర్’ పేరును కూడా ‘దీక్షాభూమి’గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, 1956 అక్టోబర్‌లో నాగ్‌పూర్‌లో తన అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారని గుర్తు చేశారు. అంబేద్కర్ పట్ల దేశమంతా ఎంతో గౌరవం, గాఢమైన విశ్వాసం కలిగి ఉన్నదని తెలిపారు. ‘దాదర్ అనేది కేవలం ఒక స్టేషన్ మాత్రమే. డాక్టర్ అంబేద్కర్ గారికి ఇచ్చే అత్యున్నత గౌరవం నాగ్‌పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చడమే అవుతుంది. ముఖ్యమంత్రి దీనిపై ప్రతిపాదన తీసుకురావాలి. మేము దానికి మద్దతు ఇస్తాం. డాక్టర్ అంబేద్కర్ జీవితంలో సామాజిక విప్లవం నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి నుంచే మొదలైంది. ఈ విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే, ప్రభుత్వానికి మేం అండగా నిలుస్తాం’ అని ఆయన అన్నారు.
కాగా, 1956 డిసెంబర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరణించిన తర్వాత ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ‘చైత్యభూమి’ వద్ద ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్ పేరును ‘చైత్యభూమి’గా మారుస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల తెలిపారు. దీనికి అవసరమైన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని అన్నారు. అయితే బీఆర్ అంబేద్కర్ గౌరవార్థం నాగ్‌పూర్ పేరును కూడా ‘దీక్షాభూమి’గా మార్చాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
Sanjay Raut | నాగ్‌పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
‘9+12 విద్యా విధానంతో డ్రాప్ అవుట్లకు చెక్’
JEE Main | రేపటితో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు..!
‘చిన్ననాటి నుండే శ్రమ, క్రమశిక్షణ అలవర్చుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

