‘9+12 విద్యా విధానంతో డ్రాప్ అవుట్లకు చెక్’
రాష్ర్ట ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకున్న నిర్ణయాన్ని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ స్వాగతించారు. దేశంలోని నాలుగు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ 9+12 విద్యా విధానాన్ని సమర్థవంతంగా..
– బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ
బీబీనగర్, నవంబర్ 21 : రాష్ర్ట ప్రభుత్వం విద్యా విధానంలో తీసుకున్న నిర్ణయాన్ని బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ స్వాగతించారు. దేశంలోని నాలుగు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ 9+12 విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు పాఠశాలల్లో సీనియర్ సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ విధానం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్లు తగ్గడంతో పాటు పేద కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నర్సరీ నుండి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్య, ఐదు నుండి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్య, తొమ్మిది నుండి పన్నెండో తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యను అమలు చేయాలని వివరించారు. అయితే, కొత్త విద్యా విధానాన్ని అమలు చేసే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న క్యూఆర్ బిల్లులో జనాభా ప్రాతిపదికన కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యారంగానికి ఎన్నికల హామీ మేరకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘9+12 విద్యా విధానంతో డ్రాప్ అవుట్లకు చెక్’
JEE Main | రేపటితో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు..!
‘చిన్ననాటి నుండే శ్రమ, క్రమశిక్షణ అలవర్చుకోవాలి’
Idupu Kayitham | ‘గోగులు గోగులు గోపాలకృష్ణుడు సేలి’.. ఆకట్టుకుంటున్న ‘ఇడుపుకాయితం’ పెళ్లి సాంగ్
AP News | నన్ను పెళ్లికి పిలిస్తే సొంత చెల్లిపైనే అడ్డమైన రాతలా..? వైఎస్ జగన్పై చంద్రబాబు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

