AP News : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీతా రెడ్డి.. వివేకా హత్య కేసు విచారణ, ఇటీవలి తీర్పులు సరిగా లేవని ఆరోపిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు. విచారణ సరిగా జరగకపోవడంవల్లే తాము పదేపదే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
వివేకా హత్య జరిగిందనే విషయం అందరికంటే ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలుసని సునీత ఈ సందర్భంగా స్పష్టంచేశారు. విచారణలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఏదో ఒకరోజు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకంతోనే తాను ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నానని అన్నారు. న్యాయమే గెలుస్తుందని, న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు.