యుద్ధ భూమిలోకి లేజర్ ఆయుధ వ్యవస్థ
భారత రక్షణ రంగంలోకి మరో అత్యాధునిక ఆయుధం వచ్చి చేరింది. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న లేజర్ ఆయుధ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ ఆయుధాన్ని రూపొందించింది. ఈ వ్యవస్థ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ల సమూహాన్ని, నిఘా సెన్సర్లను లక్ష్యంగా చేసుకోగలదు. 2025 ఏప్రిల్లోనే కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ కేంద్రంలో దీని తుది పరీక్షలు పూర్తయ్యాయి.
- అభివృద్ధి చేసిన డీఆర్డీవో సంస్థ
న్యూఢిల్లీ : భారత రక్షణ రంగంలోకి మరో అత్యాధునిక ఆయుధం వచ్చి చేరింది. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న లేజర్ ఆయుధ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఈ ఆయుధాన్ని రూపొందించింది. ఈ వ్యవస్థ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ల సమూహాన్ని, నిఘా సెన్సర్లను లక్ష్యంగా చేసుకోగలదు. 2025 ఏప్రిల్లోనే కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ కేంద్రంలో దీని తుది పరీక్షలు పూర్తయ్యాయి. ఆ పరీక్షల్లో ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ను, ఒకేసారి అనేక డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని టెస్టు చేశారు. దాంతో పాటు నిఘా సెన్సర్లు, యాంటెన్నాను కూడా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇందులో పరీక్షించారు. వీటన్నింటిలో ఈ వ్యవస్థ మంచి పనితీరు కనబరచడంతో మరో ఆరు నెలల్లో దీని తయారీ కోసం డీఆర్డీవో ఓ ప్రైవేట్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకోబోతున్నది.
ఈ ఆయుధం రాడార్ లేదా ఎలక్ట్రో ఆప్టికల్ ద్వారా లక్ష్యాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత లేజర్ కాంతి వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి మందుగుండు లేదా రాకెట్లను వాడాల్సిన అవసరం లేదు. అందువల్ల డ్రోన్ దాడుల సమయంలో ప్రత్యేకంగా క్షిపణులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. పైగా క్షిపణులతో పోలిస్తే లేజర్ వ్యవస్థ లక్ష్యాలను వేగంగా చేరుకుని ధ్వంసం చేస్తుంది. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు యాంటీ డ్రోన్ లేజర్ వ్యవస్థలను వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లిస్టులోకి చేరిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

