హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అధికార కేంద్రం చుట్టూ వేలాడుతున్న ‘షాడోలు’ కేవలం పైరవీలు, కమీషన్ల దందాలకే పరిమితం కాలేదా? అంతకుమించిన వికృత సంసృతితో హద్దులు దాటి బరితెగిస్తున్నారా? వ్యాపార అనుమతులు, ప్రభుత్వపరమైన సాయం కోసం వ చ్చిన మహిళలను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే మిస్‌వరల్డ్ పోటీలో అందగత్తెతో మిస్ బిహేవ్ చేసి పరువు పోగొట్టిన షోడో గ్యాంగ్.. ఆ వికృత చేష్టలను ఇంకా కొనసాగిస్తున్నదా? అంటే కాంగ్రెస్ పాలన లో వరుస పరిణామాలు ‘అవును’ అనే చె ప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తారాచౌదరి వ్యవహారం నుంచి నేటి ‘షాడో సీఎంవో’ పెత్తనం దాకా సాగుతున్న ఈ వ్యవహారాలు అధికార దర్పం ఎంతగా దిగజారిందో స్పష్టం చేస్తున్నాయి. బయటపడినవి కొన్నేనని, తెరవెనుక మరుగునపడిన బాధిత మహిళల ఆక్రోశాలు ఇంకెన్నోనని తెలుస్తున్నది.
అధికార దర్పం.. విచ్చలవిడితనం
రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం ని బంధనల ప్రకారం కాకుండా, ‘షాడో సీఎంవో’గా చలామణీ అవుతున్న కొందరు ము ఖ్యుల కనుసన్నల్లో నడుస్తున్నదనే ఆరోపణ లు మొదటినుంచీ ఉన్నాయి. సమస్యల పరిషారం, వ్యాపార అనుమతుల కోసం వచ్చే సామాన్యులు, మహిళా ఔత్సాహికులు వీరి చేతిలో అవమానాల పాలవుతున్న తీరు వి మర్శలకు తావిస్తున్నది. తాజాగా వెలుగుచూసిన గెస్ట్‌హౌస్ ఉదంతమే దీనికి ఉదాహరణ. అవుట్ డోర్ అడ్వైర్టెజింగ్ రంగంలో చ ట్టబద్ధమైన వ్యాపార అవకాశం కోసం, ప్ర భుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రతిపాదనలతో కొన్నేండ్లుగా పోరాడుతున్న ఒక మహిళా పారిశ్రామికవేత్తకు అత్యంత చేదు అనుభవం ఎదురైంది.
తన సమస్యపై మా ట్లాడేందుకు ముఖ్యనేత అనుచరుడిగా, షా డోగా చక్రం తిప్పుతున్న నేతను ఆమె సం ప్రదించారు. అయితే ఆమెను సచివాలయానికి కాకుండా, ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌కు రా వాలనడం చర్చనీయాంశమైంది. ఇక 72వ ‘మిస్ వరల్డ్’ పోటీల సమయంలోనూ అధికార పార్టీ అతి చేష్టలు దేశం పరువును బజారున పడేశాయనే ఆరోపణలు న్నాయి. ఒక అధికారిక విందు సందర్భంగా విదేశీ పోటీదారుతో అధికార వర్గాలు అనుచితంగా ప్రవర్తించడంతో అర్ధాంతరంగా వైదొలగారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అధికారదర్పానికి విచ్చలవిడితనం తోడైతే పాలనా వ్యవస్థలు ఎలా భ్రష్టుపడుతాయో ఈ ఘటనలు కండ్లకు కడుతున్నాయని పరిశీలకులు మండిపడుతున్నారు.
ఇది కొత్తేమీ కాదు
అధికార కేంద్రాల చుట్టూ మహిళల పేర్లు, వ్యక్తిగత వివాదాలు ముడిపడి రాజకీ య దుమారాలు చెలరేగడం ఇదే తొలిసా రి కాదు. దాదాపు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన తారాచౌదరి ఉదంతాన్ని గుర్తుచేస్తున్నా రు. ఆ సమయంలో పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లతోపాటు ప్రస్తుత ముఖ్యనేత పేరు చుట్టూ తీవ్ర ఆరోపణలు, రాజకీ య విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయం లో విపక్షాలు, ప్రత్యర్థులు పరస్పర వ్యక్తిగత నిందారోపణలతో రచ్చకెక్కారు. ఆధారాల తో నిరూపించాలని సవాళ్లు, ప్రతిసవాళ్లూ సాగాయి. నాటి ఆరోపణలు రాజకీయ కు ట్రల్లో భాగమా? లేదా వాస్తవాలా? అన్నది పకనపెడితే, పలుకుబడి ఉన్న నేతల చు ట్టూ వివాదాలు ముసురుకోవడం పాలనా విలువలను ఎంతగా దిగజారుస్తున్నాయో స్పష్టమవుతున్నది. అధికారం ముసుగులో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న స్వార్థశక్తులను కట్టడిచేసి, మహిళా ఆత్మగౌరవానికి భంగం కలుగకుండా చర్యలు తీసుకోకపోతే పాలకులపై ప్రజల్లో మిగిలి ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.