పండుగ సీజన్లో విమాన చార్జీలపై పరిమితి విధించం
రానున్న పండుగ సీజన్లో విమాన చార్జీలపై ప్రభుత్వం పరిమితి విధించబోదని, అయితే ధరలను సహేతుకంగా ఉంచాలని విమానయాన సంస్థలకు సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు మంగళవారం తెలిపారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు.
- కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
- 85 శాతం వరకు పెరిగిన ఎకానమీ క్లాస్ చార్జీలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: రానున్న పండుగ సీజన్లో విమాన చార్జీలపై ప్రభుత్వం పరిమితి విధించబోదని, అయితే ధరలను సహేతుకంగా ఉంచాలని విమానయాన సంస్థలకు సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు మంగళవారం తెలిపారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారితో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు.
ముఖ్యంగా పండుగ సీజన్ వంటి కీలక సమయాల్లో ప్రయాణించాలనుకునే వారికి ప్రయోజనం చేకూరేలా విమాన టికెట్ల ధరలను సహేతుకమైన స్థాయిలోనే ఉంచాలని వారికి కచ్చితంగా తాము సూచిస్తుంటామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం విమాన చార్జీలు రెండు విభిన్నమైన ధోరణులను అనుసరించాయి. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే చాలా మార్గాలలో బిజినెస్ క్లాస్ చార్జీలు తగ్గాయి. జూన్ నెలలో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే 20 దేశీయ విమాన మార్గాలలో 18 మార్గాలపై సగటు ఎకానమీ చార్జీలు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి.
దీనికి భిన్నంగా 2024 జూన్లో 17 మార్గాల్లో ఎకానమీ చార్జీలు తగ్గాయి. ఈ ఏడాది జూన్లో అత్యంత రద్దీగా ఉండే 11 దేశీయ విమాన మార్గాల్లో ఎకానమీ తరగతి చార్జీలు 15 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. వీటిలో ఐదు మార్గాల్లో చార్జీ పెరుగుదల 30 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీనికి భిన్నంగా 16 మార్గాల్లో బిజినెస్ క్లాస్ చార్జీలు తగ్గాయి. కొన్ని మార్గాల్లో ఈ తగ్గుదల 49.3 శాతం వరకు ఉంది. పశ్చిమాసియా యుద్ధంతో విమాన ఇంధన ధరలు సుమారు 33 శాతం పెరిగాయని, దీని ప్రభావం చార్జీలపై పడిందని వారు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

