మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మక్తల్: జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టును ఎండబెట్టి కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మాజీ మం త్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసుకున్న రైతులు నీళ్లు విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో దిగి వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు నీటిని విడుదల చేయడానికి అంగీకరించిందని తెలిపా రు. కృష్ణా జలాలను ఆంధ్రాకు దోచిపెట్టడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. జిల్లా రైతులు సాగునీటి కోసం గోసపడుతుంటే ఈ జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి నా ప్రయోజనం లే కుండా పోయిందని, ఆయనను రైతులు క్షమించరని హెచ్చరించారు.
రైతులను కష్టపెడితే ఊరుకోం: చిట్టెం
జూరాల నుంచి రైతులకు సాగునీటిని ఎందుకు వదలరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. మంగళవారం నా రాయణపేట జిల్లా మక్తల్‌లోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు ఎడుమ, కుడి కాలువల కింద రైతులు సాగు చేసిన పంటలు పొట్ట దశలో ఉన్నాయని తెలిపారు. ఈ సమయంలో కాలువలకు నీటిని వదలకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.