భువనేశ్వర్ : కాక్రోచ్ జనతా పార్టీ మరో పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ జాతీయ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకుని స్కూల్ ఠీక్ కరో ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం నవనిర్మాణ్ యువ ఛాత్ర సంఘటన్ నిరసనలకు సౌరవ్ దాస్ మద్దతు తెలిపారు. ఒడిశాలోని 8వ తరగతి దాకా పాఠ్యపుస్తకాల్లో 1,678 తప్పులపై ఎన్వైసీఎస్ నిరసనలు చేస్తున్నది.
ఇదే విషయంపై అసెంబ్లీని ఘెరావ్ చేస్తామని ఎన్వైసీఎస్ ప్రకటించింది. ఈ సందర్భంగా సౌరవ్ దాస్ మాట్లాడుతూ. వెంటనే ఒడిశా విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒడిశాలోని ప్రభుత్వ స్కూళ్లలో సరైన బెంచీలు లేవని, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. అనేక పాఠశాలలు కూలిపోయే దశకు చేరుకున్నాయని, స్టూడెంట్లు ప్రమాదకర పరిస్థితుల్లో చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.