Korean Kanakaraju | వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు అదిరిపోయే ఓపెనింగ్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ స్టార్ట్!
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా సరైన విజయం దక్కలేదు. వరుస సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆయన అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్‌కు భారీ ఊరటనిచ్చేలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా సరైన విజయం దక్కలేదు. వరుస సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆయన అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్‌కు భారీ ఊరటనిచ్చేలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. సత్య కీలక పాత్రలో కనిపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్, తొలి రోజు కలిపి రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన సినిమాకు ఇది మంచి ఓపెనింగ్గా చెప్పొచ్చు. అంతేకాదు.. వరుణ్ తేజ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. గతంలో వరుణ్ తేజ్‌కు అత్యధిక ఓపెనింగ్ అందించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాను ‘కొరియన్ కనకరాజు’ అధిగమించింది. దీంతో చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లోనూ సినిమా మంచి ఆరంభాన్ని అందుకుంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకు 1.75 లక్షల డాలర్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అనుగుణంగా చూస్తే ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ‘కొరియన్ కనకరాజు’ మంచి జోరు చూపించింది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి 2.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. తొలి రోజు వసూళ్లతో పాటు సినిమాకు వస్తున్న మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉండటం మేకర్స్‌కు మరింత కలిసొచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా హారర్, కామెడీ అంశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయనే టాక్ రావడంతో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ‘కొరియన్ కనకరాజు’కి మరో ప్లస్ పాయింట్ సోమవారం బోనాల హాలీడే. వీకెండ్‌తో పాటు సోమవారం కూడా థియేటర్లకు ప్రేక్షకుల రాక పెరిగితే సినిమా కలెక్షన్లకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా.. ఇదే జోరును వీకెండ్లో కొనసాగిస్తే వరుణ్ తేజ్ కెరీర్లో మరో విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

