YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
YS Jagan | న్యాయమైన, సమగ్రమైన కుల గణనకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.
అమరావతి : న్యాయమైన, సమగ్రమైన కుల గణనకు( Caste enumeration ) వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ( YS Jagan ) ప్రకటించారు. ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో భేటీ అయిన విషయాన్ని జగన్ ట్వీట్ ( Tweet ) చేశారు. ‘ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
జనాభా లెక్కలకు సంబంధించి కుల గణన అంశాలు, ఆందోళనలపై చర్చించాను. సామాజిక న్యాయం సాధించాలంటే సమగ్ర, సుస్థిర, సమాన అభివృద్ధికి వీలుగా వాస్తవ గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణనకు సంబంధించి వారు చేసిన డిమాండ్లు సమంజసమైనవి. వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గణన ప్రక్రియలో ఏ కులం కూడా మిగిలిపోకుండా సమగ్ర కులాల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచాలని కమిటీ డిమాండ్ చేసిందన్నారు. ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిని తెలియజేసే వివరాలను నమోదు చేయాలని, సమగ్ర కుల గణన చేపట్టాలన్న డిమాండ్‌ను ముందు నుంచే వైసీపీ సమర్ధిస్తు వస్తుందని వెల్లడించారు. వాస్తవ గణాంకాల ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయడానికి కచ్చితమైన, సమగ్రమైన, అందరినీ కలుపుకొని సాగే కుల గణన ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

