తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
Tamil Nadu investments leaked to Andhra | తమిళనాడులో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఇది మరింత బలపడింది.
చెన్నై: తమిళనాడులో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఇది మరింత బలపడింది. దీనిపై దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి ఇది దారి తీసింది. (Tamil Nadu investments leaked to Andhra) తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ విధానానికి సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట తమిళనాడులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
కాగా, తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ అయిన ‘గైడెన్స్ తమిళనాడు’ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ విభాగంలో చాలా కాలంగా పని చేస్తున్న సీనియర్ అధికారులు కీలకమైన పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వచ్చిన కంపెనీల వివరాలను ఆంధ్రా ప్రభుత్వానికి వారు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు తర్వాత 15 మంది సీనియర్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. తొలగించిన సీనియర్ అధికారుల్లో చాలా మంది 2016 నుంచి 2021 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరు తమ పదవుల్లో కొనసాగారు.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తొలగించిన అధికారులలో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమిళనాడులో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలను దెబ్బతీయడానికి పెద్ద కుట్ర జరిగిందా? పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన నేతృత్వంలోని శాఖను లక్ష్యంగా చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ వివాదంపై స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన విమర్శించారు, దశాబ్దాలుగా నిర్మితమైన ఒక సంస్థను రాజకీయ వివాదంలోకి ప్రభుత్వం లాగుతోందని ఆయన ఆరోపించారు. ‘తమిళనాడుకు చెందిన అత్యుత్తమ మేధావుల కృషి ఫలితంగా ఏర్పడిన ఒక సంస్థను, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అపరిపక్వమైన, సోషల్ మీడియా ఆధారిత రాజకీయాల ద్వారా దెబ్బతీయడం చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
అలాగే కొంతమంది ఉద్యోగులు సంస్థను వీడటం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం దెబ్బతింటుందనే ప్రభుత్వ వాదనను కూడా టీఆర్బీ రాజా ప్రశ్నించారు. ‘తమిళనాడు పెట్టుబడుల వ్యవస్థ, పారిశ్రామిక వాతావరణం అంత బలహీనంగా ఉన్నాయని ఈ ప్రభుత్వం భావిస్తోందా?’ అని ఆయన నిలదీశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఈ ఆరోపణలను ఖండించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 15 officials
- Amid
- Andhra
- details
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
AP News | బొత్స ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం.. కేవలం ఒక్క ఎంపీపీ స్థానమే దక్కిన వైనం..!
Rajinikanth | మనవడితో రజినీకాంత్ స్టైలిష్ వాక్ అదిరిందంతే
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

