లక్నో: రామ్‌లీలా నాటక ప్రదర్శనలో రాముడి బాణం రావణుడి కంటికి తగిలింది. కంటి నుంచి రక్తం కారడంతో పాటు తీవ్ర గాయమైంది. (Ram’s arrow hits Ravan’s eye) దీంతో రాముడి పాత్రధారి, నిర్వాహకుడిని వైద్యం కోసం రావణుడి పాత్రధారి ఆర్థిక సహాయం కోరాడు. నిరాకరిచిన వారిద్దరూ కులం పేరుతో తనను దూషించి కొట్టినట్లు ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్ 13న షాహగంజ్లో రామ్‌లీలా నాటక ప్రదర్శన జరిగింది. సునీల్ కుమార్ రావణుడి పాత్ర పోషించగా, నైతిక్ పాండే రాముడి పాత్రలో నటించాడు.
కాగా, యుద్ధ సన్నివేశం సందర్భంగా రాముడి పాత్రధారి ప్రయోగించిన బాణం రావణుడి కిరీటానికి బదులు ఆ పాత్రలో నటించిన సునీల్ కుమార్ కంటికి తగిలింది. తీవ్ర గాయం కావడంతో పాటు కంటి నుంచి రక్తం, నీరు కారింది. ఈ నేపథ్యంలో కంటికి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని నిర్వాహకుడు రామ్‌సనేహి సింగ్, రాముడు పాత్రదారి నైతిక్ పాండేను సునీల్ కుమార్ కోరాడు.

Sunil Kumar
మరోవైపు వైద్యానికి సహాయం నిరాకరించిన వారిద్దరూ తనను కులం పేరుతో దూషించడంతో పాటు కొట్టి తరిమినట్లు రావణ పాత్రధారి సునీల్ కుమార్ ఆరోపించాడు. మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించాడు. జనవరి 23న మరోసారి పోలీసులకు వినతి పత్రం ఇచ్చాడు. దీంతో నాటక నిర్వాహకుడు, రాముడు పాత్రధారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
यूपी के सोनभद्र में रामलीला मंचन के दौरान ‘राम’ की तीर से रावण का किरदार निभा रहे शख्स की आंख की रोशनी चली गई
◆ इसके बाद ‘राम’ का किरदार निभा रहे नैतिक पांडेय और कार्यक्रम के आयोजक रामसनेही सिंह के खिलाफ SC/ST एक्ट में मामला दर्ज किया गया है
◆ बता दें कि, यह मामला 13 नवंबर… pic.twitter.com/4LgotEFjP9
— Times Now Navbharat (@TNNavbharat) January 31, 2026
Also Read:
Union Budget 2026 | మహిళల నేతృత్వంలో రిటైల్ ఔట్లెట్లు.. ‘షీ మార్ట్’లకు బడ్జెట్లో ప్రోత్సాహం
Union Budget 2026: దివ్యాంగులు, కృత్రిమ అవయవాల ఉత్పత్తిపై కేంద్రం దృష్టి
Union Budget 2026: కొత్తగా మూడు అఖిల భారత ఆయుర్వేద సంస్థలు.. ఆయుష్ ఫార్మసీలు అప్‌గ్రేడ్