న్యూఢిల్లీ: సాంప్రదాయ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రధాన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా మూడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఫార్మసీల అప్‌గ్రేడ్‌ను బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. (Union Budget 2026) ఆయుర్వేద ఆధారిత ఆరోగ్య సంరక్షణ, ఆయుష్ వ్యవస్థ కింద సేవలను మెరుగుపర్చడం, రోగులకు మెరుగైన ఔషధాల లభ్యత వీటి లక్ష్యమని వివరించారు.
కాగా, వైద్య పర్యాటకం కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని సీతారామన్ తెలిపారు. ప్రపంచ సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో భారతదేశ పాత్రను బలోపేతం చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.
Also Read:
Union Budget 2026 | దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత.. రూ.7.85 లక్షల కోట్ల బడ్జెట్
Union Budget | కొబ్బరి ప్రోత్సాహక పథకం.. కాతలేని చెట్ల స్థానంలో కొత్త చెట్లు
Union Budget | గుడ్‌న్యూస్.. చిన్న మదుపరులు, భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే వారికి బెనిఫిట్స్
Union Budget | ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి వెల్లడి