Union Budget : ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఐటీ చట్టం (New Income Tax Act) అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తెలిపారు. ఇవాళ లోక్‌సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్యులు సైతం ఐటీ రిటర్న్స్ (IT returns) ఫైల్ చేసేలా కొత్త చట్టంలో మార్పులు చేసినట్లు చెప్పారు.
సరళతరం చేసిన దరఖాస్తులు త్వరలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించనున్నట్లు తెలిపారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును
డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. విదేశీ యాత్రలపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. చదువులు, వైద్యంపై టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గించినట్లు చెప్పారు.
కాగా 1961 నాటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం స్థానంలో ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చారు. నూతన ‘ఇన్కమ్ ట్యాక్స్ చట్టం-2025’ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు.