న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం కేంద్ర బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ((Union Budget 2026) ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాద బెదిరింపులు, రక్షణ వ్యయంలో పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ రెండో అతి పెద్ద నిధులు కేటాయించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 7.85 లక్షల కోట్ల బడ్జెట్ మంజూరు చేశారు. ఈ పెరిగిన మొత్తం జీడీపీలో 11 శాతానికి సమానం. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ. 6.81 లక్షల కోట్ల కంటే ఇది ఎనిమిది శాతం ఎక్కువ.
కాగా, రఫేల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, మానవరహిత వైమానిక వాహనాల కాంట్రాక్టుల వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ దళాల ఆధునీకరణ కోసం రూ. 2.19 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటే ఇది 21.84 శాతం అధికం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ మంత్రిత్వ శాఖ మూలధన వ్యయం కోసం రూ.1.8 లక్షల కోట్లు.
మరోవైపు మూలధనంలో విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ. 63,733 కోట్లు కేటాయించారు. రక్షణ సేవల (రెవెన్యూ) కోసం బడ్జెట్ కేటాయింపును అదనంగా 17.24 శాతం పెంచారు. నిర్వహణ, మందుగుండు సామగ్రి, ఇంధనం, మరమ్మతులు మొదలైన ఖర్చులు, సహాయక సిబ్బంది జీతాలతో సహా రోజువారీ కార్యకలాపాల కోసం ఈ నిధులు వినియోగిస్తారు. పెన్షన్ల కేటాయింపును 6.53 శాతం పెంచి రూ. 1.71 లక్షల కోట్లకు చేర్చారు.
కాగా, రక్షణ రంగంలోని యూనిట్ల ద్వారా నిర్వహణ, మరమ్మత్తు లేదా సమగ్ర పునరుద్ధరణ అవసరాల కోసం ఉపయోగించే విమానాల భాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదించారు.
Also Read:
Union Budget | ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి వెల్లడి
Union Budget | కొబ్బరి ప్రోత్సాహక పథకం.. కాతలేని చెట్ల స్థానంలో కొత్త చెట్లు
Union Budget | గుడ్న్యూస్.. చిన్న మదుపరులు, భారత్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే వారికి బెనిఫిట్స్
Nirmala Sitharaman | దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు : నిర్మలా సీతారామన్