దమ్మపేట, జూలై 30 : అల్ప పీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దమ్మపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్ (U/T) & తాసీల్దార్ మద్దినేని మురళి సూచించారు. చెరువులు, వాగుల ప్రవాహం ఉన్న ప్రదేశాలకు అలాగే చేపల వేటకు వెళ్లకూడదన్నారు. గ్రామంలోకి ఎటువంటి వరద నీరు వచ్చినా సమాచారం ఇవ్వాలన్నారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పరిస్థితి సద్దుమనిగే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు.