కొత్తకోట రూరల్, అక్టోబర్ 3 : పార్టీ కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనంతపురం గ్రామానికి చెందిన బజారు ఆంజనేయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ విషయాన్ని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రూ.5 లక్షల చెక్కును ఇవ్వాలని నిర్ణయించగా.. కేటీఆర్ సూచన మేరకు శనివారం రామనంతపురంలోని ఆంజనేయులు ఇంటికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి.. అతడి భార్య మనీషా, తల్లికి చెక్కు అందజేశారు.