హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మొన్న భద్రాద్రి.. నిన్న యాదాద్రి.. ఇలా వరుసగా షట్‌డౌన్ అవుతున్న థర్మల్ ప్లాంట్ల వరుసలో తాజాగా కొత్తగూడెం ప్లాంట్ చేరింది. భదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని మరో యూ నిట్ కూడా షట్‌డౌన్ అయింది. ఇటీవల టీజీ జెన్కోకు చెందిన థర్మల్ ప్లాంట్లు వరుసగా షట్‌డౌన్ అవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రెండు ప్లాంట్లు షట్‌డౌన్ అయ్యాయి.
కొత్తగూడెం థర్మల్ ప్లాంట్‌లోని యూనిట్-12లో బాయిలర్ ట్యూబ్ లీకయింది. దీంతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌లోని యూనిట్-4 కూడా షట్‌డౌన్ కావడంతో 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలోని నాలుగు థర్మల్ యూనిట్లు బంద్ అయ్యాయి. షట్‌డౌన్ సమస్యలతో ఏకంగా 2,140 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం 7,180 మెగావాట్లు.
కాగా, భద్రాద్రి ప్లాంట్‌లోని యూనిట్-3 ఈనెల 9నుంచి బంద్ అయింది. ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ సమస్యతో ఈ ప్లాంట్ నడువడం లేదు. భదాద్రి ప్లాంట్‌లోనే యూనిట్-3, యూ నిట్-4 కలిపితే 540 మెగావాట్లు విద్యుదుత్పత్తికి బ్రేక్‌పడింది. యా దాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్-1 ఈ నెల 29 నుం చి నడువడం లేదు. ఫ్లేమ్ ఫెయిల్యూర్ సమస్యతో ఈ యూనిట్ షట్‌డౌన్ అయింది. తాజాగా కేటీపీఎస్‌లోని యూనిట్-12లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రెండు యూనిట్లతో 1,600 మెగావాట్లు విద్యుత్తు అందుబాటులో లేదు.